తెలంగాణ

telangana

ETV Bharat / state

p.chidambaram : 'మోదీ ఆ పని చేస్తే పెట్రోల్ రూ.32కే ఇవ్వొచ్చు: చిదంబరం - p.chidambaram in geetham university visit

పెద్దనోట్ల రద్దు వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం అన్నారు. మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా.. అమలులో విఫలం అయ్యారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

congress-leader-chidambaram-visited-geetham-university
congress-leader-chidambaram-visited-geetham-university

By

Published : Aug 19, 2021, 9:58 AM IST

Updated : Aug 19, 2021, 3:16 PM IST

ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపడమే తమ ప్రధాన విధి అని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. సమస్యను గుర్తించి, దాన్ని పరిష్కరించేలా విధానాలు రూపొందించాలని ప్రభుత్వాలకు సూచించారు.

గీతం వర్సిటీలో చిదంబరం

సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఉద్దేశించి చిదంబరం ప్రసంగించారు. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రయోజనం కంటే.. నష్టమే ఎక్కువగా జరిగిందని అన్నారు. దీన్ని మంచి ఉద్దేశంతో తీసుకువచ్చినా అమలు మాత్రం అత్యంత అధ్వాన్నంగా జరిగిందని తెలిపారు. ధనవంతులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకున్నారని, అతి తక్కువ సంఖ్యలో బ్యాంకులు ఉన్న బిహార్, ఈశాన్య రాష్ట్రాల వంటి ప్రాంతాల్లో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.

" అత్యవసర నిధులు, ప్రత్యేక పథకాల కోసం పెట్రోల్​పై సెస్ విధిస్తుంది. ఇది కొంత కాలం మాత్రమే ఉండాలి. కానీ, ప్రస్తుత ప్రభుత్వం దీన్నో అవకాశంగా మార్చుకుంది. సెస్​ల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉండదు. ప్రస్తుతం పెట్రోల్ మీద ఉన్న సెస్ తొలగిస్తే పెట్రోలు ధరను రూ.32వరకు తగ్గించవచ్చు. టాడా, ఉల్ఫా వంటి చట్టాలు కొన్ని ప్రత్యేక అవసరాల కోసం కాలపరిమితితో తీసుకువస్తారు. అవసరాలు తీరిన తర్వాత ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలి. వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఇలా జరగడం లేదు. ఇటువంటి చట్టాల్లో కేవలం 2శాతమే శిక్షలు పడుతున్నాయి. రాజకీయ ప్రతీకారాలు తీర్చుకోవడానికే ఈ చట్టాలు ఉపయోగిస్తున్నారు."

- చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి

బాలాకోట్ దాడులు సరైన సమయంలో అభినందించేలా జరిగాయని చిదంబరం అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. తాము ఆ దాడులకు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతిపక్షాలుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే తమ ప్రధాన విధి అని స్పష్టం చేశారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. తన స్వీయ అనుభవాలను వారితో పంచుకున్నారు.

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం
Last Updated : Aug 19, 2021, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details