తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం:అనిల్ కుమార్

ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్​కుమార్ పటాన్​చెరులో ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు.

హస్తం గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించాలి : గాలి అనిల్

By

Published : Apr 3, 2019, 8:25 PM IST

పటాన్​చెరులోని ఆల్విన్ కాలనీలో గాలి అనిల్ ఇంటింటికి ప్రచారం
భాజపా, తెరాసలు ఎన్ని కుట్రలు చేసినా మెదక్ కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులోని ఆల్విన్ కాలనీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. నల్లధనాన్ని వెనక్కి రప్పించి ప్రజల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన భాజపా ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు.

రైతు రుణమాఫీ అమలు చేయడంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేసినందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి హస్తం గుర్తుకే ఓటేసి తనని గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details