సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణ పనులకోసం నిర్మించిన కట్డడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఆ వ్యక్తిపై కక్ష కట్టి పురపాలక సిబ్బంది ఈ తరహాలో చర్యలకు ఉపక్రమించారని పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
'కక్ష కట్టి కూల్చేశారు' - congress counselors protest in narayanakhed
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణ పనులను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో నల్లబ్యాడ్జీలతో హాజరై నిరసన తెలిపారు.
!['కక్ష కట్టి కూల్చేశారు' congress counselors protest in narayanakhed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7315288-411-7315288-1590220924951.jpg)
నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ కౌన్సిలర్లు
మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నల్లబ్యాడ్జీలకో హాజరై నిరసన తెలిపారు. బాధిత వ్యక్తికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.