తెలంగాణలో భాజపా 2023 ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని భాజపా నేత విజయశాంతి అన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామ పరిధిలో కాంగ్రెస్, తెరాస కార్యకర్తలు భాజపాలో చేరారు. వారికి విజయశాంతి కండువా కప్పి... పార్టీలోకి ఆహ్వానించారు.
మూసీ నీరు... కేసీఆర్ మాటలు ఒక్కటే: రాములమ్మ - Telangana BJP latest news
సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామ పరిధిలో కాంగ్రెస్, తెరాస కార్యకర్తలు భాజపాలో చేరారు. వారికి విజయశాంతి కండువా కప్పి... పార్టీలోకి ఆహ్వానించారు. తెరాసతో ప్రజలకు ఏం లాభం లేదని ఆరోపించారు.
ఎక్కడా చూసినా... ప్రజలు భాజపా.. భాజపా అంటున్నారని పేర్కొన్నారు. తెరాసతో ప్రజలకు ఏం లాభం లేదని... మూసీ నీరు.. కేసీఆర్ మాటలు ఒక్కటేనని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణను దోచుకుంటుందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కలిసే పరిస్థితి లేదన్నారు. భాజపా అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజలకు లాభం జరుగుతుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్, తెదేపా, తెరాస పార్టీలు పాలన చేసినప్పటికీ ఎటువంటి మార్పు రాలేదని వ్యాఖ్యానించారు. కేవలం అది భాజపాతోనే సాధ్యమని రోజురోజుకు భాజపా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.