సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణానికి చెందిన నరిసింహులు, బిజిలీపూర్ గ్రామానికి చెందిన మమతతో గత మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ నెల 9న వారిమధ్య గొడవ జరగటం వల్ల నరిసింహులు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతని కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య - husband suicide due to wife
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా భర్త చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త మృతితో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
భార్యాభర్తల మధ్య గొడవ.... భర్త ఆత్మహత్య
సోమవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని ఓ చెట్టుకు అతను ఉరేసుకొని మృతి చెందిన దృశ్యాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నరసింహులు మృతితో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.