డిపోలో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి 3 నెలలు గడుస్తున్నా.. యాజమాన్యం తమ సర్టిఫికెట్లను ఇవ్వడంలేదని ఆరోపిస్తూ సంగారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ ధ్రువపత్రాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ డిపో ఎదుట విద్యార్థుల ఆందోళన - సర్టిఫికెట్లు ఇవ్వాలని సంగారెడ్డిలో విద్యార్థుల ఆందోళన
కోర్సు పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా.. తమ సర్టిఫికెట్లను సంగారెడ్డి డిపో ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వడంలేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 10 మందికి పైగా విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో అప్రెంటిస్‌షిప్ కోసం 2019లో చేరామని విద్యార్థులు తెలిపారు. తమ కోర్సు పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్లను ఇవ్వకుండా డిపో అధికారులు నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్రువపత్రాలను తీసుకుని ఒక పాస్ ఇచ్చారని అన్నారు. ఈ విషయంపై డిపో మేనేజర్ నాగభూషణంను వివరణ కోరగా.. సదరు సెక్షన్‌కు సంబంధించిన క్లర్క్ అనారోగ్యంగా ఉండటంతో వేరే వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. 15 రోజుల వ్యవధిలో విద్యార్థులకు వారి సర్టిఫికెట్లను అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:అడ్డసరం మొక్కలో.. కరోనా ప్రభావం తగ్గించే జన్యువులు