చిన్న చిన్న సమస్యలను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి జస్టిస్ సాయి రమాదేవి పేర్కొన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఏ సమస్య అయినా.. కఠినం కాకముందే దానిని పరిష్కరించుకోవాలని సూచించారు.
'సమస్యల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమం'
ఏదైనా సమస్య తలెత్తినప్పుడు కోర్టుల్లో కేసులు వేయకుండా.. రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని న్యాముమూర్తి జస్టిస్ సాయి రమాదేవి సూచించారు. సంగారెడ్డిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
'సమస్యల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమం'
కోర్టుల్లో కేసులు వేయడం వల్ల సమయం వృథా అవుతుందని.. పరిష్కారం కోసం రాజీ మార్గం ఎంచుకోవడం ఉత్తమమన్నారు. కక్షిదారులు తమ సమస్యల నివృత్తికై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులను సంప్రదించాలని కోరారు.
ఇవీ చూడండి:'రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా మారుస్తాం'