తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆమే హత్య చేసి.. అదృశ్యమయ్యాడని ఫిర్యాదు - sangareddy district crime news today

మానవత్వం మంట కలుస్తోంది.. బంధాలకు విలువలు లేకుండా పోతున్నాయి. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం వద్దన్నందుకు వినక పోగా.. భర్తను చంపేయాలని మరో మహిళతో కలిసి పన్నాగం పన్నింది ఆ భార్య. సినిమాకు తీసుకెళ్లే దారిలో మద్యం తాగించి రాళ్లతో కొట్టి క్రూరంగా చంపారు. ఈ ఘోరమైన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

Complaint that the tortoise had disappeared at sangareddy district
ఆమే హత్య చేసి.. అదృశ్యమయ్యాడని ఫిర్యాదు

By

Published : Feb 21, 2020, 3:33 PM IST

వివాహేతర సంబంధం వద్దనందుకు భార్య మరో మహిళతో కలిసి భర్తను కొట్టి చంపింది. సంగారెడ్డి జిల్లా బొల్లారం బీరప్ప బస్తీకి చెందిన వెంకటమ్మ కొంతకాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఇది తెలిసిన భర్త వెంకటయ్య ఆమెను పలుమార్లు మందలించాడు. అది నచ్చని లక్ష్మమ్మ భర్తను హత్య చేయాలని పొరుగున వెంకటమ్మతో కలిసి పన్నాగం పన్నింది.

అటవీ ప్రాంతంలో..

సినిమాకి తీసుకెళ్లమంటూ భర్తను కోరింది. ఈనెల 17న భార్య, పొరుగున ఉున్న లక్ష్మమ్మను తీసుకొని ముగ్గురు సినిమాకి బయలుదేరారు. మార్గమధ్యలో మద్యం తాగేందుకు అమీన్​పూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెంకటయ్యను తీసుకెళ్లారు. విపరీతంగా మద్యం తాగించారు. మత్తులో ఉండగానే రాళ్లతో కొట్టి హత్య చేశారు.

ఏమీ తెలియనట్టు..

తర్వాత ఏమీ తెలియనట్టు బొల్లారం పోలీస్​స్టేషన్​కి వెళ్లి భర్త అదృశ్యమయ్యాడని భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటకమ్మ ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తానే హత్య చేసినట్టు ఒప్పకుంది. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువురిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఆమే హత్య చేసి.. అదృశ్యమయ్యాడని ఫిర్యాదు

ఇదీ చూడండి :మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!

ABOUT THE AUTHOR

...view details