సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని స్థానిక శాసనసభ్యుడు మాణిక్ రావ్ ప్రారంభించారు. కోటి రూపాయల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవంలో భాగంగా సర్వమత ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా సమస్యలకు వేదికగా ఉండాలని మాణిక్ రావ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జహీరాబాద్‌లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ప్రారంభం - mla
ప్రజా సమస్యలకు వేదికగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సేవలు అందించాలని జహీరాబాద్ శాసన సభ్యుడు మాణిక్ రావ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ను ప్రారంభించారు.
క్యాంపు ఆఫీస్ ప్రారంభిస్తున్న మాణిక్ రావ్