తెలంగాణ

telangana

ETV Bharat / state

మన్సాన్​పల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన - అందోల్​ మండలం

30రోజుల ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మన్సాన్​పల్లిలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.

మన్సాన్​పల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

By

Published : Sep 21, 2019, 5:13 AM IST

30 రోజుల ప్రణాళికలో భాగంగా.. గ్రామ స్వరూపాలు మారి ప్రతి గ్రామం పచ్చని హరివిల్లులా వికసించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రజలకు సూచించారు. ఆందోల్ మండలం మన్సాన్​పల్లిలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ప్రతి వీధి కలియతిరిగుతూ.. గ్రామస్తులతో ముచ్చటించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు. ఇంటిముందు చెత్త, పిచ్చి మొక్కలు ఉన్న వారి ఇళ్లను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని సర్పంచ్​కు సూచించారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించినట్లు హనుమంతరావు తెలిపారు.

మన్సాన్​పల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

ABOUT THE AUTHOR

...view details