తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాభివృద్ధి పనుల్లో నిర్లక్ష్య ధోరణి వీడాలి: కలెక్టర్ - గ్రామాభివృద్ధిలో నిర్లక్ష్యం వీడాలన్న సంగారెడ్డి కలెక్టర్

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలంలోని పలు గ్రామాల్లో పాలనాధికారి హనుమంతరావు పర్యటించారు. వైకుంఠధామాలు, రైతు వేదికల పనుల్లో నిర్లక్ష్య ధోరణి విడనాడకుంటే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

collector hanumantharao visit at patancheru on developments in villages
పటాన్ చెరులో కలెక్టర్ హనుమంతరావు పర్యటన

By

Published : Jul 27, 2020, 9:46 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం భానూరు, నందిగామ, కర్థనూరు గ్రామాల్లో కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా పర్యటించారు. గ్రామాల్లోని వైకుంఠధామాలు, రైతు వేదికల నిర్మాణ పనులు పురోగతి జిల్లా పాలనాధికారి హనుమంతరావు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ గ్రామాల్లో నిర్వహించే పనులు వేగవంతం చేయాలని పాలనాధికారి సూచించారు.

సంబంధిత అధికారులు సర్పంచులకు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. పనుల్లో నాణ్యత ఉండాలని.. గ్రామ పారిశుద్ధ్య నిర్వహణ బాగుపడాలని, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ సక్రమంగా చేసి రక్షించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట 40 మందికి టోకరా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details