కరోనా కట్టడి నేపథ్యంలో అత్యవసరాల కోసం జహీరాబాద్లోని ప్రాంతీయ ఆసుపత్రి భవనంలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్నందున ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు.
జహీరాబాద్లో 30 పడకల ఐసోలేషన్ వార్డు - జహీరాబాద్లో 30 పడకల ఐసోలేషన్ వార్డు ఆస్పత్రి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రిలో 30 పడకల ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా పాలనాధికారి హనుమంతరావు తెలిపారు. రెండు వెంటిలేటర్లు ఇతర పడకలను 24 గంటల లోపు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

జహీరాబాద్లో 30 పడకల ఐసోలేషన్ వార్డు
అనవసరంగా రోడ్లపైకి రావడాన్ని మానుకోవాలని కలెక్టర్ కోరారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని... సామాజిక దూరం పాటించాలని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే కరోనాను తరిమికొట్టగలమని అందరూ బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
జహీరాబాద్లో 30 పడకల ఐసోలేషన్ వార్డు
ఇదీ చూడండి:కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...