తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిర్ణీత గడువులోగా రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలి' - raithu vedhika buildings

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​, కల్హేర్ మండలాలల్లోని నిజాంపేట్, కృష్ణాపూర్ గ్రామాల్లో కలెక్టర్​ హనుమంతరావు పర్యటించారు. నిర్మాణంలో ఉన్న రైతు వేదికల పనుల పురోగతిని పరిశీలించారు. చేస్తున్న పనుల్లో నాణ్యతను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు.

collector hanumantharao visited raithu vedika buildings
collector hanumantharao visited raithu vedika buildings

By

Published : Sep 5, 2020, 7:34 PM IST

రైతు వేదికల నిర్మాణాలు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నారాయణఖేడ్​, కల్హేర్ మండలాలల్లోని నిజాంపేట్, కృష్ణాపూర్ గ్రామాల్లో కలెక్టర్​ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న రైతు వేదికల పనుల పురోగతిని పరిశీలించారు. చేస్తున్న పనుల్లో నాణ్యతను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు.

పనులు త్వరితగతిన పూర్తి చేయాలని... జాప్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్​ హెచ్చరించారు. పనులను దగ్గరుండి చూసుకోవాలని గ్రామ సర్పంచులకు తెలిపారు. కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజనల్ అధికారి అంబదాస్ రాజేశ్వర్, పంచాయతీ రాజ్ ఏఈ మాధవ నాయుడు, ఆయా గ్రామాల సర్పంచులు, సంబంధిత కాంట్రాక్టర్లు ఉన్నారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details