సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, కంగ్టి, ర్యాకల్, తడ్కల్, జంగి, గాజులపాడ్ గ్రామాల్లో కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా పర్యటించారు. నిర్మాణంలో ఉన్న రైతు వేదికల పనుల పురోగతిని పరిశీలించారు. రైతు వేదికల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.
నాణ్యత లేకుంటే కఠిన చర్యలు: కలెక్టర్ హనుమంతరావు
రైతు వేదికల నిర్మాణ పనులు నాసిరకంగా ఉంటే సంబంధిత గుత్తేదారులపై క్రిమినల్ కేసులు పెడతామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. నారాయణఖేడ్, కంగ్టి మండలాల్లోని ర్యాకల్, తడ్కల్, జంగి, గాజులపాడ్ గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు.
నారాయణఖేడ్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
జంగిలో నాసిరకంగా ఉన్న రైతు వేదిక నిర్మాణాన్ని కూల్చి వేశారు. స్థానిక పంచాయతీ ఏఈ మాధవనాయుడుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్లకు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులు దగ్గరుండి చూసుకోవాలని గ్రామ సర్పంచ్లకు సూచించారు.