గ్రామాల పరిధిలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారి హనుమంతరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం లక్డారం గ్రామంలో డంపింగ్ యార్డ్, వైకుంఠధామాల నిర్మాణాల పురోగతిని ఆయన స్థానిక సర్పంచ్ అధికారులతో కలసి పరిశీలించారు. నిర్ణీత సమయంలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని జాప్యం చేయరాదని తెలిపారు.
'పల్లెలను స్వచ్ఛ, హరిత గ్రామాలుగా మార్చుకోవాలి'
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పలు గ్రామాల్లో జిల్లా పాలనాధికారి హనుమంతరావు పర్యటించారు. గ్రామాల్లో డంపింగ్ యార్డు, వైకుంఠధామాల పనులను త్వరితగితన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాలను స్వచ్ఛ, హరిత గ్రామాలుగా మార్చుకోవాలి
అలాగే తడి, పొడి చెత్తలను వేరు చేసి ఇవ్వాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా అన్ని చర్యలు చేపట్టాలని.. గ్రామాలు స్వచ్ఛ హరిత గ్రామాలుగా రూపొందాలని సర్పంచ్‌కు సూచించారు. డంప్ యార్డులు పూర్తైన దగ్గర డంప్‌యార్డు నిర్వహణతో పాటు ఎరువు తయారీకి చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఇదీ చూడండి:చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్