తెలంగాణ

telangana

ETV Bharat / state

Sangameshwara And Basaveshwara : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిన సీఎం - నారాయణఖేడ్​లో ఎత్తిపోతల పథకం

Sangameshwara And Basaveshwara: కరవు సీమకు గోదావరి జలాలు అందించే బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల పథకాల శిలాఫలకాలు ఆవిష్కరించారు.

Basavwshwara
Sangameshwara

By

Published : Feb 21, 2022, 4:28 PM IST

Updated : Feb 21, 2022, 5:01 PM IST

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిన సీఎం

Sangameshwara And Basaveshwara : సంగారెడ్డి జిల్లాలో బీడు భూములను సస్యశ్యామలం చేసేలా నారాయణ్‌ఖేడ్‌లో నిర్మిస్తున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ వెనకబడిన ప్రాంతాలు. ఈ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో తాగు నీటికి కూడా కటకటే. కరవుతో అల్లాడే ఈ ప్రాంతాలకు గోదావరి నీళ్లు తీసుకు వచ్చి బంగారు పంటలు పండిచేలా... రెండు ఎత్తిపోతల పథకాలు... సంగమేశ్వర, బసవేశ్వర రూపొందించారు. వీటి ద్వారా నారాయణఖేడ్, జహీరాబాద్​తో పాటు ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలు సైతం ప్రయోజనం పొందనున్నాయి. రూ.4,500 కోట్లతో నిర్మించే ఈ పథకాల ద్వారా 3 లక్షల 90వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.

సంవత్సరం పొడవునా జలకళ..

సంగమేశ్వర, బసవేస్వర ఎత్తిపోతల పథకాలను సింగూర్ జలాశయం మీద నిర్మించనున్నారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు నీటిని అందించేందుకు కాళేశ్వరం నుంచి 20 టీఎంసీలు కేటాయించారు. ఇందుకోసం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సింగూర్ జలాశయాన్ని అనుసంధానించనున్నారు. సింగూర్​కు ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం లేకపోయినా.. కాళేశ్వరం నీటితో సంవత్సరం పొడవునా జలకళతో ఉండనుంది. సంగమేశ్వర ద్వారా 12 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. దీని ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల పరిధిలోని 2 లక్షల 19వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. బసవేశ్వర ద్వారా 8 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లోని లక్షా 65 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. ఎత్తిపోతల పథకాల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు మంత్రి హరీశ్​రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :Harish Rao Narayankhed Tour : 'అక్కడ భూములు అమ్ముకోవద్దు.. భవిష్యత్తులో కోట్లు వస్తాయి'

Last Updated : Feb 21, 2022, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details