సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామికవాడలోని శాండ్విక్ పరిశ్రమ ఆవరణలో సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తం కార్మికులకు మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కార్మిక సంఘ నాయకులతో ప్లకార్డులు పట్టుకుని కొవిడ్ నిబంధనల మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు నిరసన వ్యక్తం చేశారు.
కేంద్రం కరోనా ముసుగులో కార్మిక హక్కుల్ని హరిస్తోంది: రాములు - latest news of chukka ramulu protest and support to the labours in sangaeddy patan cheru
కరోనా ముసుగులో జాతీయ సంపదను కొల్లగొట్టే కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామికవాడలోని కార్మికులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు.
![కేంద్రం కరోనా ముసుగులో కార్మిక హక్కుల్ని హరిస్తోంది: రాములు citu state president chukka ramulu protest and support to the labours in sangaeddy patan cheru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7649647-52-7649647-1592374743171.jpg)
కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ పేరుతో తెస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని చుక్కరాములు తెలిపారు. కరోనా కాలంలో లాక్డౌన్ కష్టాలతో కార్మికులు, ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే కేంద్రప్రభుత్వం ఆదుకోవాల్సిందిపోయి... పెట్టుబడిదారులకు మేలుచేస్తే విధంగా ప్యాకేజీలు రూపొందించి.. కరోనా ముసుగులో కార్మిక హక్కులే లేకుండా చేయాలని చూస్తుందని ఆరోపించారు. లాభాలలో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికవర్గం ఐక్యపోరాటాలకు సిద్ధంకావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:హస్తకళాకారులకు కరోనా కష్టం