సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికసంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కరోనా నివారణలో ముందుండి పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.50లక్షల బీమా వర్తింపజేయాలని కోరారు.
పూల జల్లులు కాదు... పీపీఈ కిట్లు ఇవ్వండి - CITU Dharna for workers' rights
లాక్డౌన్ నేపథ్యంలో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేసి నెలకు 25 వేల రూపాయల వేతనం ఇవ్వాలని సంగారెడ్డి అమీన్పూర్లో సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. రెడ్జోన్లో పనిచేస్తున్న కార్మికులకు పీపీఈ కిట్లను ఇవ్వాలని సూచించారు.
పూల జల్లులు కాదు... పీపీఈ కిట్లు ఇవ్వండి
నెలకు రూ.25వేల వేతనంతో పాటు బియ్యం, నిత్యవసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. రెడ్ జోన్లో పనిచేస్తున్న వారందరికీ పీపీఈ కిట్లు ఇచ్చి ప్రజాఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు చప్పట్లు, పూలు చల్లటంతోనే సరిపోదని వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.