కరోనా కల్లోల సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు అండగా ఉన్న తమకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని... ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
పీఆర్సీ అమలు కోరతూ కలెక్టరేట్ ముందు ధర్నా - CITU Dharna in front of Sangareddy Collectorate
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు.
సంగారెడ్డి కలెక్టరేట్ ముందు సీఐటీయూ ధర్నా
ఆసుపత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాలు వెంటనే పెంచి, పీఆర్సీ అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుంది: తలసాని