గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లాకు చెందిన పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు రూ. 8500 వేల వేతనాన్ని ప్రకటించినా... ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే... భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు హెచ్చరించారు.
'కార్మికుల సమస్యలు పరిష్కరించండి' - CITU ACTIVISTS PROTEST IN FRONT OF COLLECTORATE
తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
CITU ACTIVISTS PROTEST IN FRONT OF COLLECTORATE