తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం - సీఐటీయూ ఆధ్వర్యంలో సుదీర్ఘ పోరాటాలు చేశామన్న నేతలు

సీఐటీయూ 50వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. సంగారెడ్డిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. కొత్త బస్టాండు సమీపంలో కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా సీఐటీయూ నేతలు నిరసన తెలిపారు.

CITU 50th Anniversary Day Celebrations ..In Sangareddy
ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం

By

Published : May 30, 2020, 2:06 PM IST

సంగారెడ్డిలో సీఐటీయూ 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. కొత్త బస్టాండు సమీపంలో కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గత 50 ఏళ్లుగా కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో సుదీర్ఘ పోరాటాలు చేశామని నేతలు వెల్లడించారు. కార్మిక చట్టాలను కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణ త్యాగాలు జరిగిన విషయం గుర్తు చేసుకున్నారు.

100 ఏళ్లుగా పోరాడి సాధించుకున్న హక్కులను.. మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని సీఐటీయూ నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయాలు మార్చుకోవలన్నారు.. లేదంటే ఐక్య పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:ఒకే ఇంట్లో నలుగురికి కరోనా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details