తెలంగాణ

telangana

ETV Bharat / state

క్యాన్సర్​తో బాధపడుతున్న బాలుడి చికిత్సకు సర్పంచ్​ సాయం - sangareddy district latest news

సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామ సర్పంచ్ నీలం మధు తన మానవత్వాన్ని చాటుకున్నారు. బ్లడ్ క్యాన్సర్​తో బాధపడుతోన్న ఓ బాలుడి చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు. ఆపద సమయంలో ఆపన్నహస్తం అందించి నేనున్నానంటూ భరోసా కల్పించారు.

చిట్కూల్​ సర్పంచ్​ సాయం
చిట్కూల్​ సర్పంచ్​ సాయం

By

Published : Apr 11, 2021, 10:18 AM IST

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చెండూరు గ్రామానికి చెందిన సంతోశ్ అనే వ్యక్తి నాలుగేళ్ల కుమారుడు తరుణ్ తేజ్ కొంతకాలం నుంచి బ్లడ్ కాన్సర్​తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం చిట్కూల్ గ్రామ సర్పంచ్ నీలం మధు బాలుడి చికిత్స కోసం సాయం అందించారు. తరుణ్​ తేజ్​ తండ్రి సంతోశ్​కు రూ.2 లక్షలు అందజేశారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలోనే సంతృప్తి ఉంటుందని మధు అన్నారు. ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: శునకాల కోసం పెట్​ పార్కు.. ఎక్కడో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details