తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లి, చెల్లి హత్యతో అనాథగా మారిన బాలుడు - తల్లి, చెల్లి హత్యతో అనాథగా మారిన బాలుడు

కంటికి రెప్పలా పెంచిన తల్లి... అన్నయ్యా.. అంటూ ఆప్యాయంగా పిలిచే చెల్లి.. ఒక్కసారే హత్యకు గురయ్యారు. ఆ బాలుడిని ఒంటరి చేశారు. విగత జీవులుగా పడి ఉన్న తల్లి, చెల్లి మృతదేహాలను చూస్తూ.. అమ్మా అమ్మా అంటూ గుండెలవిసేలా రోదించింది ఆ పసి హృదయం. తన అమ్మ, చెల్లి హత్యకు నాన్నే కారణమంటూ బోరున విలపించాడు బాలుడు.

child became orphan duo to the murder of  mother and sister
తల్లి, చెల్లి హత్యతో అనాథగా మారిన బాలుడు

By

Published : Dec 29, 2019, 12:05 AM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామ శివారులో ఈనెల 25న జయశీల(33), ఆమె కూతురు సిరి(4) హత్యకు గురయ్యారు. తల్లి, కూతుర్ల మృతికి ఆమె భర్త బాలయ్యే కారణమంటూ కుమారుడు శివ, బంధువులు మృతదేహాలను కదలనివ్వకుండా ఆందోళన చేశారు. జయశీల బాలయ్యకు రెండవ భార్య. పథకం ప్రకారమే తండ్రి బాలయ్య తల్లిని చంపినట్లు కుమారుడు శివ పోలీసులకు వివరించాడు.

వాటా ఇవ్వాల్సి వస్తుందనే

రెండవ భార్య కావడం వల్ల ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే.. కాపు కాసి చంపేశారని జయశీల అమ్మ, అన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా పోలీసులు సరిగా స్పందించడం లేదని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇంత కిరాతకంగా హత్య చేసిన బాలయ్యను ఉరి తీయాలని, శివకు మంచి విద్య అందించాలని డిమాండ్ చేశారు. నా అన్న వాళ్ళను కోల్పోవడం వల్ల శివ ఒంటరిగా మిగిలిపోయాడు. అధికారులు స్పందించి అతన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

తల్లి, చెల్లి హత్యతో అనాథగా మారిన బాలుడు

ఇవీ చూడండి: కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details