సంగారెడ్డి జిల్లా కేంద్రం పరిధి ఇటుక బట్టీల్లో పనిచేస్తోన్న కార్మికుల చిన్నారులను జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి బ్రహ్మాజీ సందర్శించారు. అనంతరం వారితో మాట్లాడి వివరాలు సేకిరించారు. చిన్నారులకు బాలామృతం, గుడ్లు, గర్భిణీలకు పౌష్టికాహారం, కిట్లు అందించారు. జిల్లాలో ఎక్కడ వలస కార్మికులు ఉన్నా గుర్తించి గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమకు పౌష్టికాహరం అందించేందుకు కృషి చేసిన 'ఈటీవీ తెలంగాణకు' కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇటుక బట్టీ చిన్నారులకు బాలామృతం, గుడ్లు పంపిణీ
లాక్డౌన్ నేపథ్యంలో ఇటుక బట్టీల్లో కార్మికుల చిన్నారులు, గర్భిణీలు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ తెలంగాణలో 'దుర్భర బతుకులు' పేరుతో ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు.
చిన్నారులు, గర్భిణీలకు బాలమృతం, గుడ్లు అందించిన అధికారులు