తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె ప్రగతితో గ్రామాల్లో మార్పు కనిపిస్తోంది: సీఎస్ - Sangareddy, Vikarabad District latest News

రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా ముందుగా కామారెడ్డికి చేరుకున్న ఆయన అనంతరం సంగారెడ్డి, ఆ తర్వాత వికారాబాద్‌ జిల్లాలను సందర్శించారు. గ్రామాల్లో పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు.

పారిశుద్ధ్యం, పచ్చదనంలో రాష్ట్రం మెరుగు : సీఎస్
పారిశుద్ధ్యం, పచ్చదనంలో రాష్ట్రం మెరుగు : సీఎస్

By

Published : Jun 5, 2020, 7:35 PM IST

రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు సీఎస్ సోమేశ్‌కుమార్‌ జిల్లాల బాట పట్టారు. ఇందులో భాగంగా ముందుగా కామారెడ్డికి చేరుకున్న సీఎస్.. జిల్లాలో రెండు గ్రామాలను ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం అక్కడి నుంచి సంగారెడ్డి, ఆ తర్వాత వికారాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఆయా జిల్లాల్లోనూ.. రెండేసి గ్రామాల్లో పనులు జరుగుతున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రతి నెలా ప్రభుత్వం రూ. 308 కోట్లను పంచాయతీలకు విడుదల చేస్తోందని వెల్లడించారు.

పారిశుద్ధ్యం, నర్సరీలపై ప్రత్యేక దృష్టి..

జిల్లాల పర్యటన సందర్భంగా పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటిక, నర్సరీ, తెలంగాణకు హరితహారంపై సీఎస్ ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే పల్లె ప్రగతి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

ఆ అంశాల్లో మార్పు !

పల్లె ప్రగతి వల్ల గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని.. పారిశుద్ధ్యం, పచ్చదనం విషయంలో రాష్ట్రం మెరుగైన స్థానంలో ఉందని సీఎస్ పేర్కొన్నారు. పర్యటనలో గుర్తించిన అంశాలపై సోమేశ్​కుమార్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతి కుమార్ ముఖాముఖి.

పారిశుద్ధ్యం, పచ్చదనంలో రాష్ట్రం మెరుగు : సీఎస్

ABOUT THE AUTHOR

...view details