సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కరోనా ప్రభావానికి చికెన్ రేట్లు ఆకాశాన్నంటాయి. సామాన్యులు చికెన్, మాంసం తినడానికి ఆలోచిస్తున్నారు. వారానికి ఒక్కసారి తినడమే కష్టంగా మారింది. పైగా కరోనా క్లిష్ట కాలంలో ఉపాధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇళ్లలో మాంసం ప్రియులు ఉన్నందున.. రేట్లు పెరిగినా తప్పక తినాల్సి వస్తోందన్నారు.
రోజూవారీ గిరాకీతోనే...
కరోనా కారణంగా వివాహ వేడుకలు, హోటళ్లు, కర్రీ పాయింట్లు మూతపడటం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అమ్మకందారులు ఆందోళన వ్యక్తం చేశారు. చికెన్ రేట్లు పెరగటం వల్ల ఎవరూ కొనేందుకు ముందుకు రావట్లేదన్నారు. వేడుకల ఆర్డర్లు లేని సమయంలో రేట్లు పెరిగినందున రోజువారీ గిరాకీతోనే సంతృప్తి పడాల్సి వస్తోందన్నారు.