రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోలేదని అప్రమత్తంగా లేకపోతే చాపకింద నీరులా విరుచుకుపడే ప్రమాదముందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంఛార్జి మదన్మోహన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మదన్మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.
జహీరాబాద్లో రసాయన ద్రావణం పిచికారీ - chemical spray in sangareddy
కరోనా నివారణ చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ముందుకెళ్తోందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంఛార్జి మదన్ మోహన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మదన్మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు.

జహీరాబాద్లో రసాయన ద్రావణం పిచికారీ
రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్ధరణ పరీక్షల్లో గోప్యత పాటించకుండా అందరికీ పరీక్షలు నిర్వహించి పూర్తి స్థాయిలో వైరస్ను కట్టడి చేయాలని మదన్మోహన్ రావు కోరారు.