రాష్ట్రంలో లాక్డౌన్ అమలు నేపథ్యంలో.. తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లీ మండలం మాడిగి శివారులో.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తోన్న వాహనాలను అడ్డుకుంటున్నారు.
రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు - సరిహద్దుల్లో వాహన తనిఖీలు
లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలను అధికారులు ఆపి వేస్తున్నారు.
inspections at state borders
పోలీసులు.. అత్యవసర, మెడికల్ సంబంధిత, సరుకు రవాణా వాహనాలను మాత్రమే రాష్ట్రంలోనికి అనుమతిస్తున్నారు. సొంత వాహనాలలో రాకపోకలు సాగిస్తోన్న ప్రయాణికుల నుంచి.. అనుమతి పత్రాలు, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్నారు.