సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో దొంగతనం జరిగింది. ఏడుగురు యువకులకు చెందిన రెండు గదుల్లో ఎనిమిది చరవాణిలు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించుకుని వెళ్ళిపోయారు. యువకులు గీతం విశ్వవిద్యాలయం లో చదువుకుంటున్నారు. కొంత మంది బొల్లారం రెడ్డీల్యాబ్ పరిశ్రమలో పని చేస్తూ చదువుతున్నారు. నిన్న రెండో షిఫ్ట్ విధులకు వెళ్లి వచ్చి గదిలో పడుకున్నారు. వారు గాలికోసం తలుపులు తెరిచి ఉంచడంతో రెండు గదుల్లో 8 చరవాణిలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఏటీఎం కార్డులు దొచుకుని వెళ్లిపోయారు. బాధిత యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒకేసారి 8 చరవాణిలు చోరీ - సంగారెడ్డి జిల్లా
చదువుకునే యువకుల వద్ద ఒకేసారి 9 చరవాణిలు చోరీ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఒకేసారి 9 చరవాణిలు చోరీ
ఇదిలా ఉండగా... పటాన్చెరు మార్కెట్లో కూరగాయలు కొంటున్న మహేష్ అనే వ్యక్తి వెనుక జేబులో ఉన్న చరవాణిని దొంగలించారు.
ఇదీ చూడండి : ఫేస్బుక్ తెచ్చిన తంటా... జూనియర్పై సీనియర్ల దాడి