స్వామి వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్ద చెల్మెడలో యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంజీరా అభ్యుదయ సేవా సంస్థ ఆధ్వర్యంలో.. వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'యువత వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి' - మహనీయుడి స్ఫూర్తి
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మంజీరా అభ్యుదయ సేవా సంస్థ ప్రతినిధులు వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'యువత వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి'
మహనీయుడి స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని గ్రామ సర్పంచ్ ప్రభుకుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ ప్రతినిధులు, గ్రామంలోని పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'యువత ఉన్నత శిఖరాలను చేరుకోవాలి'