సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు, బీజేవైఎం నాయకులు ఆశిష్ గౌడ్‌పై కేసు నమోదైంది. నాలుగు సెక్షన్ల కింద పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేమైందంటే..
వరద బాధితులకు వచ్చిన పరిహారాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కాజేస్తున్నారంటూ ఆశిష్ గౌడ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి.. వారి పరువుకు భంగం కలిగించారంటూ తెరాస నాయకులు విజయ్ కుమార్ పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.