ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి సదాశివపేట ర్యాలీలో... సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుర్భాషలాడారు. జగ్గారెడ్డి తీవ్రస్థాయి అసభ్య పదజాలంతో మాట్లాడిన దృశ్యాలను ఓ వ్యక్తి సెల్ ఫోన్లో వీడియో తీచారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. జగ్గారెడ్డి అనుచిత వాఖ్యలపై తెరాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇంత నీచంగా మాట్లాడిన వారెవరూ లేరని... ఈ మాటాలు ప్రజలు తలవంచుకునేలా ఉన్నాయని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో జగ్గారెడ్డిపై ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు