సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి కాలనీలో సుమారు వంద మంది పోలీసులు పాల్గొని ఇంటింటి తనిఖీలు చేశారు. స్థానికులు, స్థానికేతరులు వివరాలపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ- కర్ణాటక సరిహద్దు పట్టణం అవడం వల్ల నేరస్థుల కదలికలు తెలుసుకునేందుకు తరచుగా కట్టడి ముట్టడి నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
జహీరాబాద్లో నిర్బంధ తనిఖీలు - జహీరాబాద్లో నిర్బంధ తనిఖీలు
జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డిపల్లిలో పోలీసులు కట్టడి ముట్టడి నిర్వహించారు. సరైన పత్రాలు లేని మూడు ద్విచక్రవాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

జహీరాబాద్లో నిర్బంధ తనిఖీలు
Last Updated : Nov 28, 2019, 9:14 AM IST
TAGGED:
జహీరాబాద్లో నిర్బంధ తనిఖీలు