సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో నిలిపిఉంచిన కారు టైర్లను దుండగులు ఎత్తుకెళ్లారు. ఓ రెవెన్యూ అధికారి పట్టణంలో తాను నివసించే ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించడం వల్ల... కారును కలెక్టరేట్ ఆవరణలో పార్కింగ్ చేశాడు. ఇది గమనించిన దొంగలు కారు చక్రాలను మాయం చేశారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కలెక్టరేట్‌లో కారు టైర్ల దొంగతనం - Sangareddy Collectorate Car Tyres Robbery
లాక్‌డౌన్ సమయంలో దొంగలు మరింత రెచ్చిపోతున్నారు. కలెక్టరేట్ ఆవరణలో నిలిపి ఉంచిన కారు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసిన ఘటన సంగారెడ్డిలో జరిగింది.
కారు టైర్ల దొంగతనం