తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇసుకబావి వద్ద కొట్టుకుపోయిన కారు... వ్యక్తి గల్లంతు - వరదలో కొట్టుకుపోయిన కారు

వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా చాలా ప్రమాదాలు జరిగాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఇసుకబావి వద్ద వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. కారు నడిపే ఆనంద్‌ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ఆచూకీ కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

car-missing-in-heavy-floods-at-ameenpur-mandal-in-sangareddy
ఇసుకబావి వద్ద కొట్టుకుపోయిన కారు... వ్యక్తి గల్లంతు

By

Published : Oct 15, 2020, 9:03 AM IST

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ఉద్ధృతికి సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఇసుకబావి వద్ద కారు కొట్టుకుపోయింది. ఆనంద్‌ అనే వ్యక్తి కారును నడుపుకుంటూ వెళ్తుండగా... వంతెనపై నుంచి పారే మురుగు కాలువలో ప్రమాదం జరిగింది. కారుతో పాటు వ్యక్తి గల్లంతు అయ్యాడు.

తీవ్ర గాలింపు

ఆచూకీ కోసం పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కారు కోసం వరద నీటిలో పుట్టె సాయంతో మత్స్యకారుల గాలిస్తున్నారు. వాగుకు సమీపంలో ఉన్న జయలక్ష్మి నగర్‌కాలనీలో ఈ మురుగు కాలువకు ఆనుకుని నిర్మించిన ఓ ఇల్లు వరద ధాటికి కొంతభాగం కూలిపోయింది.

ఇదీ చదవండి:అప్పుడు ఆనందం నింపిన వాడే.. చివరికి కన్నీళ్లు మిగిల్చాడు

ABOUT THE AUTHOR

...view details