కరోనా వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. అయితే చాలా సంస్థలు తమకు ఉద్యోగులు వద్దంటూ తీసేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కొందరిని సంస్థ తీసేస్తుంటే.. ఉన్నవాళ్లకు సరైన గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వల్ల చాలా పెళ్లిళ్లు ఆగిపోయాయని... తమకు ఏడాది మొత్తంలో లాభాలు తెచ్చే సమయంలో కొవిడ్ వల్ల ఏ ఆర్డర్లు రావట్లేదు. పెళ్లిళ్లు లేని సమయంలో ఎక్కువ మంది యాత్రలకు వెళ్లేవారి నుంచి ఆదాయం వచ్చేది. ఆలయాల మూసివేయడం వల్ల ఆ ప్రభావమూ తమపై పడిందన్నారు.
లాక్డౌన్ సడలించినా.. అంతంతమాత్రం గిరాకీనే! - car drivers problems due to lockdown at sangareddy
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది. కొవిడ్ పుణ్యమా అని ఎంతో మంది ఉపాధికి దూరమయ్యారు. సంగారెడ్డిలోని క్యాబ్డ్రైవర్లు... వైరస్ వ్యాప్తి వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ లేకున్నా.. తమకు గిరాకీలు రావట్లేదని వాపోతున్నారు.
లాక్డౌన్ సడలించినా.. అంతంతమాత్రం గిరాకీనే!
మంచి సీజన్లో నెలకు దాదాపు రూ. 30 వేల వరకు సంపాదించేవారని.. లాక్డౌన్ సమయంలో తమకెవరూ సాయపడక తీవ్ర ఇబ్బందిపడ్డామని క్యాబ్డ్రైవర్లు వాపోతున్నారు. లాక్డౌన్ సడలింపులతో సర్వీసులు ప్రారంభించినా చిన్నా చితక గిరాకీలతో తినడానికి సరిపోతుందన్నారు. ఈ కష్ట కాలంలో తమకు న్యాయం చేయాలని క్యాబ్ యూనియన్ తరఫున డ్రైవర్లు ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చూడండి :మిడతల రోజూ ప్రయాణం 130 కిలోమీటర్లు.. ఆ జాగ్రత్తలు పాటించాలి!