తెలంగాణ

telangana

ETV Bharat / state

పటాన్​చెరులో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై రగడ - బహుళ అంతస్తు భవనాలు

సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తు భవనాలను జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు పాక్షికంగా కూల్చి వేసారు. అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు వచ్చాయా అంటూ హెచ్ఎండీఏ అధికారులు పంచాయతీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పటాన్​చెరులో అక్రమ బహుళ అంతస్తు భవనాల కూల్చివేత

By

Published : Aug 21, 2019, 7:44 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తు భవనాలను కలెక్టర్​ ఆదేశాల మేరకు పాక్షికంగా కూల్చివేశారు. పంచాయతీ అధికారులు ముందుగానే గుర్తిస్తే కూల్చాల్సిన అవసరం ఉండదంటూ హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. తొలిదశలోనే ఎందుకు గుర్తించలేకపోయారని, చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే ఈ నిర్మాణాలు వెలిశాయని పంచాయతీ అధికారులపై హెచ్ఎండీఏ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను పాక్షికంగా కూల్చివేయడం జరుగుతుందని తెలిపారు.

పటాన్​చెరులో అక్రమ బహుళ అంతస్తు భవనాల కూల్చివేత

ABOUT THE AUTHOR

...view details