బీఎస్-4 ఇంజన్ ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్లు ఈ నెల 31వ తేదీతో ముగియనున్నాయి. వాహనాల వల్ల వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు మోటారు వాహనాల కంపెనీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. భారత్ స్టేజ్ ఫోర్ పరిగణనలోకి వచ్చే వాహనాలు సంగారెడ్డి జిల్లాలో 7,261 ఉన్నాయి. వీటిలో కొన్ని వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి.
మిగిలిన వారు తాత్కాలిక నెంబర్‌తోనే కాలం గడిపేస్తున్నారు. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మార్చి 31వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వాహనదారులు వేగం పెంచుతున్నారు. రవాణాశాఖ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు.