తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎంఆర్​ఎఫ్​కు పెళ్లి ఖర్చులు.. వరుడికి కేటీఆర్ ప్రశంసలు - ktr tweet bride decission

పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించి దాతృత్వాన్ని చాటుకున్నాడు సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన యువకుడు. ఈనాడులో ప్రచురితమైన ఈ వార్తను కేటీఆర్​ ట్విట్టర్​లో పోస్టు చేస్తూ... యువకుడిని అభినందించారు.

bride gave two lakhs cheque to cmrf his marriage spendings
పెళ్లి ఖర్చులు సీఎంఆర్​ఎఫ్​కు.. వరుడి నిర్ణయం

By

Published : Apr 24, 2020, 10:21 AM IST

Updated : Apr 24, 2020, 11:39 AM IST

హంగూ ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా... వివాహానికి అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన వరుడిని కేటీఆర్​ అభినందించారు. సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన సంతోష్​ కుమార్​ అనే యువకుడి నిర్ణయాన్ని ఈనాడులో ప్రచురించింది. ఆ యువకుడిని అభినందిస్తూ కేటీఆర్​ పేపర్​ క్లిప్​ను ట్విట్టర్​లో పంచుకున్నారు.

పెళ్లి ఖర్చులు సీఎంఆర్​ఎఫ్​కు.. వరుడి నిర్ణయం

కంగ్టికి చెందిన సంతోష్​ కుమార్​ వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 26న పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం నిశ్చయించారు. లాక్​డౌన్​ కారణంగా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వివాహానికయ్యే ఖర్చు రూ.2లక్షల చెక్కును మంత్రి హరీశ్​ రావుకు అందించారు.

ఇవీచూడండి:దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం

Last Updated : Apr 24, 2020, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details