ఊయలే.. ఉరిగా మారి పదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపల్లి మండలం లింగారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీమరి నర్సింహులు, కనకమ్మ దంపతుల కుమారుడు రేవంత్ ఇంట్లో చీరతో ఊయల కట్టి ఊగుతుండగా చీర మెడకు బిగుసుకుని మృతి చెందాడు. పిల్లలు సరదా కోసం చీరతో కట్టిన ఊయలలో నిత్యం పిల్లలు ఊగుతున్నారు.
ఊయలే ఉరితాడైంది! - 10 year old boy died with swing
ఆడుకునేందుకు చీరతో కట్టిన ఊయలే బాలుడి ప్రాణం తీసిన ఘటన సిద్దిపేట జిల్లా లింగారెడ్డిపల్లిలో జరిగింది. పిల్లల సరదా కోసం కట్టిన ఊయల తమ బిడ్డ ప్రాణాలు తీసిందని తల్లిదండ్రులు బోరున విలపించారు.
![ఊయలే ఉరితాడైంది! boy died with hammock in sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7187866-328-7187866-1589391758252.jpg)
ఊయలే ఉరితాడైంది!
రోజూ మాదిరిగానే మధ్యాహ్నం ఊయల ఊగుతున్న సమయంలో వడి తిరిగింది. అదే సమయంలో బాలుడు కూర్చున్న ఊయల నుంచి కిందికి జారి పడటం వల్ల మెడకు చుట్టుకొని ఊపిరి ఆడక మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. పిల్లల సరదా కోసం కట్టిన ఊయల తమ బిడ్డ ప్రాణాలు తీసిందని తల్లిదండ్రులు బోరున విలపించారు.
ఇవీ చూడండి: ఉరేసుకుని 75 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య