సికింద్రాబాద్ లో రైల్వే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనిల్ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం శ్రీనివాసనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అనిల్ భార్య సోమవారం ఇంటి పనుల్లో నిమగ్నం అయిన సమయంలో వారి రెండున్నర ఏళ్ల బాలుడు వరుణ్ తేజ్ భవనం మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగగా... చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
బాల్కనీ నుంచి పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి - died
ఇంటిముందు ఆడుకుంటున్న రెండున్నర ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు భవనం మూడో అంతస్తు నుండి జారిపడి దుర్మరణం పాలయ్యాడు. సంగారెడ్డి రామచంద్రాపురంలో జరిగిన ఈ ఘటనతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బాల్కనీ నుంచి పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి
ప్రమాదానికి బాల్కనీ గోడ నిర్మించకుండా అద్దాలు పెట్టడమే కారణమని తెలుస్తోంది. అద్దాలు వదులుగా ఉన్నాయని మరమ్మతులు చేయించాలని ఇంటి యజమానికి పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు.
బాల్కనీ నుంచి పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి
ఇవీ చూడండి:ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి నాన్న!