Sangareddy Bore Water Without Current : సాధారణంగా బోరుబావి నుంచి నీళ్లు రావాలంటే స్టాటర్ బాక్సుమీట నొక్కాలి! అదే.. చేతి పంపు అయితే పైకీ కిందకు ఆడించాలి. కానీ.. ఆ గ్రామంలో విద్యుత్ మీటర్ నొక్కాల్సిన పని లేదు! చేతిపంపులను పైకి కిందకు ఆడించాల్సిన అవసరం అంత కన్నా లేదు. భారీ వర్షాలు కురిస్తే చాలు.. పాతాళ గంగ పైపైకి ఉబికి వస్తుంది. పని చేయని బోర్ల నుంచీ నీరు ఎగజిమ్ముతూ గ్రామస్థులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పెరుగుతున్న కాలుష్యం కారణంగా భూమిపై ఉష్ణోగ్రత పెరిగి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో బోర్లు తవ్వించినా ప్రయోజనం లేకుండాపోతోంది. పెరుగుతున్న జనాభా వల్ల చెరువు, కాల్వలు పూడ్చి భవనాలు కట్టడం కూడా భూగర్భ జలాలు తగ్గడానికి ఒక కారణం. అందువల్ల బోర్లు తవ్వించినా నీళ్లు రావడం లేదు. వర్షాలు సమృద్ధిగా పడి, చెరువులు, కుంటలు తవ్విస్తే తప్పా వాటి భూగర్భ జలాల శాతాన్ని పెండానికి వీలుండదు. అప్పుడే ప్రజలకు నీరు సమృద్ధిగా అందుతాయి. ఎప్పడి నుంచో ఉన్న చేతి పంపుల్లో కూడా నీరు రానిరోజులు ఉన్నాయి. ఈ గ్రామంలో మాత్రం వర్షకాలం వచ్చిందంటే చాలు పని చేయని బోర్లు, చేతి పంపులు అన్నీ పని చేస్తాయి. వాటికి కరెంటు అందించినా, అందించకపోయినా నీళ్లు పొంగుతాయి.
Bore Flows without motor: ఆరేళ్లుగా ఆగని జలధార.. మోటారు లేకుండానే పొంగుతున్న గంగమ్మ
సంగారెడ్డి జిల్లా ఝురాసంగం మండలం గినియార్పల్లి గ్రామంలో వర్షాకాల సమయంలోనైతే మోటార్లు వేయకపోయినా బోరు బావుల్లో నుంచి భూగర్భజలం పొంగుతూ బయటికి వస్తుంది. ఇలా దాదాపుగా రెండు నెలల పాటు ఊరు మొత్తం ఎటువంటి నీటి కొరత లేకుండా పంట పొలాలకు సరిపోతూ.. గ్రామస్థులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సమృద్ధిగా నీళ్లు లభిస్తాయి. ఊరూవాడా మొత్తం పచ్చదనంతో కళకళలాడుతుంది.