సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని వాసవి కల్యాణ మండపంలో.. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని సీఐ రాజశేఖర్ ప్రారంభించగా.. పోలీసు సిబ్బందితో పాటు యువజన సంఘాల సభ్యులు, రాజకీయ నాయకులు ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
జహీరాబాద్లో పోలీసుల రక్తదాన శిబిరం - జహీరాబాద్లో రక్తదాన శిబిరం
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసు సిబ్బందితో పాటు యువజన సంఘాల సభ్యులు, రాజకీయ నాయకులు ముందుకొచ్చి రక్తదానం చేశారు.
జహీరాబాద్లో పోలీసుల రక్తదాన శిబిరం
పట్టణంలోని వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు శిబిరానికి హాజరై దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. రక్త దాతలకు ధ్రువీకరణ పత్రాలు, పండ్లు పంపిణీ చేశారు. పోలీసు శాఖ పిలుపు మేరకు ముందుకొచ్చి రక్తదానం చేసిన దాతలకు సీఐ రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్