ఆర్టీసీ కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలని హైకోర్టు పదేపదే ఆదేశిస్తున్నా సీఎం కేసీఆర్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా నిరసన వ్యక్తం చేశారు.
'కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే కాలగర్భంలో కలిసిపోతారు'
కోర్టు ఆదేశాలను ధిక్కరించిన నాయకులు కాలగర్భంలో కలిసి పోక తప్పదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు జోస్యం చెప్పారు.
ఆర్టీసీ కార్మికులకు రఘునందన్‌రావు మద్దతు
గతంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, తమిళనాడులో జయలలిత ఇతర నాయకులు పాతాళానికి పడిపోయారని గుర్తు చేశారు. కార్మికుల సమ్మె 30 రోజులు దాటితే మాత్రం ప్రత్యక్ష ఆందోళనకు బీజం పడుతుందని హెచ్చరించారు.