తెలంగాణ

telangana

ETV Bharat / state

Praja Sangrama yathra: పండుగలకు అనుమతులు తీసుకోవాలా?: బండి సంజయ్ - బండి సంజయ్​ తాజా వార్తలు

హిందువుల పండుగలకు అనుమతులు తీసుకోవాలా? అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డికి చేరుకుంది. బహిరంగ సభలకు లేని ఆంక్షలు హిందువుల పండగలకే ఎందుకుంటున్నాయని బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

bandi sanjay
బండి సంజయ్

By

Published : Sep 8, 2021, 5:15 PM IST

తెరాస పాలన మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అంజయ్​ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంగారెడ్డిలో పాదయాత్ర చేశారు. భాజపా ప్రజా సంగ్రామ యాత్రకు అద్భుత స్పందన వస్తోందని తెలిపారు. యాత్రకు అందరు సహకరిస్తున్నారని చెప్పారు. గణేశ్‌ మండపాలకు పోలీసుల అనుమతి తీసుకోవాలని చెబుతున్నారని.. హిందువుల పండుగలకే అనుమతులు తీసుకోవాలా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. బహిరంగ సభలకు లేని ఆంక్షలు హిందువుల పండగలకే ఎలా ఉంటున్నాయన్నారు.

ఎల్లుండి వినాయకచవితి. తెలంగాణలో హిందువులు.. పండుగలు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సీఎం కేసీఆర్​ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో హిందువులు దీనస్థితిలో ఉన్నారు. వినాయక విగ్రహం ఎక్కడ పెడతారు. ఎంత ఎత్తు షెడ్​ వేస్తారు. పర్మినెంట్​ షెడ్డా, తాత్కాలిక షెడ్డా.. అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దాని కోసం యాప్​ కూడా తయారు చేశారు.

-బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

Praja Sangrama yathra: పండుగలకు అనుమతులు తీసుకోవాలా?: బండి సంజయ్


ఇదీ చదవండి:రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్‌జీటీకి కేంద్రం నివేదిక

ABOUT THE AUTHOR

...view details