'గెలిపించండి.. దిల్లీలో గళమెత్తి సమస్యలను పరిష్కరిస్తా' - party
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచార వేడి పెరుగుతోంది. స్థానికుడైన తనను గెలిపించాలంటూ భాజపా పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మారెడ్డి అభ్యర్థించారు.
జహీరాబాద్‌లో భాజపా ప్రచారం
By
Published : Apr 4, 2019, 8:03 PM IST
జహీరాబాద్‌లో భాజపా ప్రచారం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో భాజపా పార్లమెంట్ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి రోడ్ షో నిర్వహించారు. కార్యకర్తలు లక్ష్మారెడ్డిని గెలిపించాలని నినాదాలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో స్థానికేతరుడు అయిన తెరాస అభ్యర్థి బీబీ పాటిల్‌కు ఓట్లతో బుద్ధి చెప్పి భాజపాను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జిల్లాకు చెందిన వాడిగా సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తనను ఓటుతో ఆశీర్వదిస్తే నియోజకవర్గ సమస్యలపై దిల్లీలో గళమెత్తి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.