పేద ప్రజలకు బంగారు భవిష్యత్తు కావాలంటే గ్రేటర్ ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని పటాన్చెరు 113వ డివిజన్ అభ్యర్థి ఆశిష్ గౌడ్ పేర్కొన్నారు. తన డివిజన్లోని జేపీ కాలనీలో ఇంటింటికి వెళ్లి ముమ్మరంగా ప్రచారం చేశారు.
'గెలిపిస్తే ప్రజల పక్షాన గొంతుక వినిపిస్తా' - సంగారెడ్డి జిల్లా తాజా సమాచారం
గ్రేటర్ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పటాన్చెరు డివిజన్ అభ్యర్థి ఆశిష్గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
' తెరాస నాయకులు వరద బాధితుల డబ్బులు కాజేశారు'
పటాన్చెరు వాసులకు బంగారుగడ్డ భూములు, ఇంద్రేశంలో జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు అందాలన్నా భాజపాతోనే సాధ్యమన్నారు. ఆరేళ్లుగా తెరాస పాలనలో ఎన్ని అరాచకాలు జరిగాయో అందరికీ తెలుసన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.