గొల్ల కురుమలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో పాలనాధికారికి భాజపా నాయకులు వినతిపత్రం అందజేశారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని భాజపా ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ ఆరోపించారు. అరచేతిలో వైకుంఠం చూపించి వారిని మోసం చేసిందని మండిపడ్డారు.
'గొర్రెల పంపిణీ పేరుతో గొల్ల కురుమలను మోసం' - yadavs requesting letter to sangareddy district collector
గొల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా భాజపా నాయకులు కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. గొర్రెల పంపిణీ పేరుతో వారి వద్ద నుంచి ప్రభుత్వం నగదు సేకరించిందని భాజపా ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ మండిపడ్డారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టర్
గొర్రెల కాపరులు కట్టిన డీడీలకు వెంటనే ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేయాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. వారి వద్ద నుంచి నగదు సేకరించి ఇప్పుడు పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:తెలంగాణ ప్రజలు కేసీఆర్ పట్ల విసుగు చెందారు: కిషన్ రెడ్డి