భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో భాజపా శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. తెరాస సర్కారుకు వ్యతిరేకంగా భవాని మందిర్ కూడలిలో నినాదాలు చేశారు.
జహీరాబాద్‌లో భాజపా శ్రేణుల రాస్తారోకో - జహీరాబాద్‌లో భాజపా నేతల రాస్తారోకో
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ జహీరాబాద్‌లో పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
జహీరాబాద్‌లో భాజపా శ్రేణుల రాస్తారోకో
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే మంత్రి హరీశ్ రావు భాజపా నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. రాస్తారోకోతో ప్రధాన రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోవడం వల్ల పోలీసులు వారిని అరెస్టు చేసి పట్టణ ఠాణాకు తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను మళ్లించారు.
ఇదీ చూడండి:దుబ్బాకలో భాజపా గెలవబోతోంది: బండి సంజయ్