తెలంగాణ

telangana

ETV Bharat / state

నాయకులనే కించపరిస్తే సామాన్యుల పరిస్థితేంటి? - bjp leaders protest in sangareddy

ఎస్సీ, ఎస్టీ, మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి భాజపా నాయకులు ఆందోళనకు దిగారు.

bjp leaders protest in sangareddy district
సంగారెడ్డిలో భాజపా నేతల ఆందోళనసంగారెడ్డిలో భాజపా నేతల ఆందోళన

By

Published : May 22, 2020, 1:51 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా నాయకులు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఎస్సీ,ఎస్టీ, మహిళా నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధికారంలో ఉన్న నాయకులనే కించపరిస్తే సామాన్య ప్రజల పరిస్థితేంటని భాజపా నాయకులు ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీల నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details